- Advertisement -
నవతెలంగాణ – మిరుదొడ్డి
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల- కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన 11వ జోనల్ లెవెల్ పోటీలలో మిరుదొడ్డి మండలం అల్వాల – పెద్ద చెప్యాల కూడలిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపల్ రఘునందన్ రావు తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ… ఈనెల 6 నుంచి 8 వరకు మానకొండూరులో జరిగిన 11 వ జోనల్ లెవెల్ పోటీలలో రామ్ సింగ్, నితిన్, అరవింద్ లు అథ్లెటిక్స్ లో బంగారు పథకాలు సాధించారన్నారు. పలు క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీరామ్, మధు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



