టెలివిజన్ రంగంలో ప్రతిభను గుర్తించి, సత్కరించేందుకు ‘తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024’ నిర్వహణకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ అవార్డ్స్‌కు సంబంధించిన విధానాలు, నియమావళి, లోగో రూపకల్పన వంటి అంశాలను ఖరారు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. 15 మంది సభ్యుల కమిటీకి టీజీఎఫ్‌డీసీ ఎండి కన్వీనర్‌గా ఉంటారు. నిర్మాత శరత్ మరార్ ఛైర్మన్‌గా ఈ కమిటీలో టెలివిజన్ పరిశ్రమ నుండి కె.బాపినీడు, మంజుల నాయుడు, పి.కిరణ్ వంటి తదితర ఇతర ప్రముఖ సభ్యులు ఉంటారు. ఈ సందర్భంగా సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, ‘సినీ, టెలివిజన్ రంగాల్లో ప్రతిభా ప్రదర్శనకు కేంద్రంగా తెలంగాణ ఎదుగుతోంది. ఈ అవార్డులు సజనాత్మకతను, స్థానిక ప్రతిభను ప్రోత్సహించే ప్రభుత్వ సంకల్పానికి ప్రతీక. చలనచిత్రం, టెలివిజన్, ఎంటర్టైన్మెంట్ ఎకోసిస్టంను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిది’ అని తెలిపారు.
తెలంగాణ టెలివిజన్ అవార్డుల చైర్మన్‌గా శరత్ మరార్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



