Monday, November 10, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంటియు జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరిని బహిష్కరిస్తున్నాం

టియు జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరిని బహిష్కరిస్తున్నాం

- Advertisement -

కొత్త కమిటీ ని రద్దు చేస్తున్నాం
టి యుజేఏసీ వైస్ చైర్మన్ బోగే పద్మ
టి యు జేఏసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాదవి

నవతెలంగాణ – హైదరాబాద్:

తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి బాధ్యతల నుంచి తొలగిస్తూ టి యు జేఏసీ నుంచి బహిష్కరిస్తున్నామని టియు జేఏసీ వైస్ చైర్మన్ బోగే పద్మ, మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాదవి తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్ లో పాత రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సుల్తాన్ యాదగిరి తన స్వార్ధం కోసం నియంత పోకడ పోతూ అవకాశ వాద రాజకీయాలకు పాల్పడుతూ ఒంటెద్దు పోకడ పోతూ పాత కమిటీకి చెప్పకుండా ఆయన కొత్త వారిని రాష్ట్ర కమిటీ లోకి తీసుకొచ్చాడు.ఈ టియు జేఏసీ లో అన్ని రాజకీయా పార్టీలకు చెందిన వారు ఉన్నారు.. స్వలాభం కోసం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చాడని ఆవేదన వ్యక్తం చేశారు. టియు జేఏసీ రాజకీయాలకు అతీతంగా పని చేస్తుందని, అలాంటిది ఒక పార్టీ కి మద్దతు ఇవ్వడంలోనే సుల్తాన్ యాదగిరి అంతర్గత స్వార్థం తేటతెల్లం అయ్యిందని అన్నారు. అదేవిధంగా మహిళలు ముదుండాలి అంటూ మహిళలను అవమానపరుస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తొందరలోనే నూతన చైర్మన్ ను ఎన్నుకుంటామని పాత రాష్ట్ర కమిటీ, జిల్లాల కమిటీ సభ్యులు 60 మంది తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టి యు జేఏసీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు కోతి మాదవి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బాబన్న, ప్రచార కార్యదర్శి డోలక్ యాదగిరి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కే రాజేంద్ర ప్రసాద్, దేవా అనసూయ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -