పశ్చిమ బెంగాల్‌లో రెచ్చిపోతున్న కామాంధులు
పశ్చిమ బెంగాల్‌లో అఘాయిత్యాలకు తెరపడటంలేదు. వైద్యవిద్యార్థినిపై లైంగికదాడి ఘటన తర్వాత లైంగికదాడి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
హుగ్లీ : పశ్చిమ బెంగాల్‌లో అఘాయిత్యాలకు తెరపడటంలేదు. వైద్యవిద్యార్థినిపై లైంగికదాడి ఘటన తర్వాత లైంగికదాడి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హుగ్లీలో శుక్రవారం రాత్రి నాలుగేండ్ల బాలికను అపహరించి లైంగిక వేధింపులకు పాల్పడగా, బాధిత చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యవర్గాలు తెలిపాయి. తారకేశ్వర్‌లోని రైల్వే షెల్టర్‌లో నిద్రిస్తున్న సమయంలో దుండగుడు దోమతెరను కట్ నాలుగేండ్ల చిన్నారిపై దారుణానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు హుగ్లీ గ్రామీణ పోలీసులకు సమాచారం అందించారు.”మా ఇండ్లను కూల్చివేశారు. వీధుల్లో నివసిస్తున్నాం. మేము ఎక్కడికి వెళ్తాం. మాకు ఇప్పటికీ ఇండ్లు లేవు” అని బాధిత కుటుంబీకులు అన్నారు.శనివారం మధ్యాహ్నం తారకేశ్వర్ రైల్వే హై డ్రెయిన్ సమీపంలో రక్తపు మడుగులో చిన్నారి కనిపించింది. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని నిబంధనల ప్రకారం పోలీసులు ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేయడానికి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది.
హుగ్లీలో చిన్నారిపై అఘాయిత్యం
- Advertisement -
- Advertisement -



