తెలంగాణ టెలివిజన్ డెవలప్‌మెంట్ ఫోరంకార్తీక మాస ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి శ్రీధర్‌బాబు
నవతెలంగాణ- హైదరాబాద్‌బ్యూరో
టెలివిజన్ కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. వారి సమస్యలు పరిష్కరించి, అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆదివారం బేగంపేట్‌లోని హరిత ప్లాజా హౌటల్‌లో ‘తెలంగాణ టెలివిజన్ డెవలప్‌మెంట్ ఫోరం’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కార్తీక మాస ఆత్మీయ సమ్మేళనం’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఎంటర్‌టైన్‌మెంట్ రంగం కీలక చోదక శక్తిగా మారిందనీ, ప్రేక్షకులకు నిరంతరం వినోదాన్ని అందించేందుకు టెలివిజన్ కార్మికులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
ఈ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరూ ప్రాజెక్ట్ సక్సెస్ కోసం కష్టపడతారని, వారి త్యాగం వెలకట్టలేనిదని ప్రశంసించారు. రాష్ట్రంలో టెలివిజన్ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, కార్మికుల ఆర్థిక, సామాజిక భద్రతా సమస్యలపై తమ ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉందన్నారు. వీటి పరిష్కారం కోసం సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత సానుకూలంగా ఉన్నారని వివరించారు. కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్, సంఘం ప్రతినిధులు సురేష్, కవిత తదితరులు పాల్గొన్నారు.
టెలివిజన్ కార్మికులకు అండగా ఉంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



