- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన తీవ్ర అస్వస్థతకు గురై ఇంట్లో కుప్పకూలారు. దీంతో ఆయన్ను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. ‘మాయమైపోతున్నడమ్మా’ గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రగీతంగా గుర్తించిన విషయం తెలిసిందే.
- Advertisement -



