- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : పల్నాడు(D) రాజుపాలెం(M) రెడ్డిగూడెం వద్ద మరో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లి ఒరిగిపోయింది. రోడ్డు విస్తరణ పనులకు ఏర్పాటుచేసిన పైపులను తగిలి బస్సు ఆగిపోయింది. దీంతో అప్రమత్తమైన 30 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాల నుంచి బయటకు దూకేశారు. ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
- Advertisement -



