Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాయమైపోయడమ్మా .. అందెశ్రీ

మాయమైపోయడమ్మా .. అందెశ్రీ

- Advertisement -

జిల్లా తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి..
నవతెలంగాణ – డిచ్ పల్లి

ప్రముఖ రచయిత, తెలంగాణా రాష్ట్ర గీతం రచయిత,అందెశ్రీ  మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని జిల్లా తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు యెనుగందుల శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉదయం ఇంట్లో కుప్పకూలిన అందెశ్రీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం విధితమే.. 1961 జూలై 18న సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించిన అందేశ్రీ జయ జయహే తెలంగాణ గీతం రచించిన అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అందెశ్రీకి ఇటీవల ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ.కోటి పురస్కారం అందించింది. అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య కాకతీయ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ అశువు కవిత్వం చెప్పడంలో అందెశ్రీ దిట్ట. 2006లో గంగ సినిమాకు అందెశ్రీకి నంది పురస్కారం పొందారన్నారు. అందెశ్రీ కి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు 2014లో అకాడమి ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్, 2015లో దాశరథి సాహితీ పురస్కారం అందుకున్న అందెశ్రీ, 2015లో రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం 2022లో అందెశ్రీ కి జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారం, లోక్‌ నాయక్‌ పురస్కారం అందుకున్న అందెశ్రీ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తూ, కుటుంబ సభ్యులందరు ధైర్యంగా మనోనిబ్బరంతో వుండాలని జిల్లా సామాజిక రచయితల సంఘము అధ్యక్షులు యెనుగందుల శంకర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -