నవతెలంగాణ – అశ్వారావుపేట
అక్షరాస్యత తోనే ఎవరికైనా సాధికారత వస్తుందనీ ఎంపీడీఓ బి.అప్పారావు అన్నారు. సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా వయోజనులను అక్షరాస్యులుగా చేసే ఉల్లాస్ కార్యక్రమం భాగంగా తెలంగాణ రాష్ట్రంలో అమ్మకు అక్షరమాల పేరుతో ప్రారంభమైన కార్యక్రమాన్ని సోమవారం మండలంలోని ఊట్లపల్లి లో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అప్పారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..ఆధునిక కాలంలో విద్య లేకపోవడం అనేక అనర్ధాలకు దారి తీస్తుంది అని,అందువల్ల వయోజనులైన నిరక్షరాస్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సర్టిఫికెట్ కూడా పొందవచ్చునని ఆయన సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ మండల అధికారి ప్రసాదరావు,ఎంపీఓ రెడ్డం కోటా రెడ్డి,సెర్ప్ ఏపీఎం దేవమణి లు పాల్గొన్నారు.


