Monday, November 10, 2025
E-PAPER
Homeతాజా వార్తలులాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మూడు రోజుల నష్టాల తర్వాత లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఐటీ, ఫార్మా స్టాక్స్‌లో కొనుగోళ్లు సూచీలకు ఊతమిచ్చాయి. అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ ముగింపు దశకు చేరుకోవడం కూడా మార్కెట్లకు కలిసివచ్చింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.2 లక్షల కోట్లు పెరిగి రూ.468 లక్షల కోట్లకు చేరింది. చివరికి బీఎస్‌ఈ సూచీ 319.07 పాయింట్లు లాభపడి 83,535.35 వద్ద, నిఫ్టీ 82.05 పాయింట్లు లాభపడి 25,574.35 వద్ద ముగిశాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -