Monday, November 10, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందెశ్రీకి ఘన నివాళులు 

బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందెశ్రీకి ఘన నివాళులు 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్  
పట్టణ బార్ అసోసియేషన్  అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో  సోమవారం బార్ అసోసియేషన్ హాల్ నందు ప్రజాకవి, తెలంగాణ ఉద్యమ కెరటం, తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందేశ్రీ అలియాస్ అందే ఎల్లయ్య అకాల మరణానికి సంతాపం తెలియజేస్తూ వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అందే శ్రీనివాస్ గారి అకాల మరణం తెలంగాణకు తీరని లోటని వారికి ఉద్యమ జోహార్లు అర్పిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ రెండు నిమిషాలు మౌనం పాటించడమైనది. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గటడి ఆనంద్, సంయుక్త కార్యదర్శి మద్దుల గంగారం, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -