- Advertisement -
నవతెలంగాణ మిడ్జిల్
అందెశ్రీ అకాల మరణం తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు అని ఆయన పాటల ద్వారా తెలంగాణ సమాజాన్ని మేలుకొల్పారని టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నరసింహులు, దళిత సంఘ నాయకులు బాలయ్య, దోనూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తారా సింగ్ అన్నారు. సోమవారం హైదరాబాదులో గుండెపోటుతో మరణించిన అందెశ్రీ కి దోనూర్ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు ఐదు నిమిషాలు మౌనం పాటించారు. ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరారు. ఆయన మరణించిన ఆయన పాటలు నిరంతరం ప్రజల్లో ఉంటాయని తెలిపారు.
- Advertisement -



