- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు పేలుళ్లు కలకలం సృష్టించాయి. ఎర్రకోట దగ్గరలోని మెట్రో గేట్ నెం-1 ఎదుట ఓ కారులో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు కారులు ధ్వంసం కాగా, మరికొన్నింటికి మంటలు అంటుకున్నాయి. సమాచారం తెలియాగానే సంఘటన స్థలానికి చేరుకున్న ఏడు ఫైర్ ఇంజన్లు..మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రగాయాలు కాగా, బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న బాంబ్ స్క్వాడ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



