Tuesday, November 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలు'భర్త మహాశయులకు విజ్ఞప్తి'

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

- Advertisement -

రవితేజ హీరోగా కిషోర్‌ తిరుమల దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్‌ సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. సోమవారం మేకర్స్‌ హ్యుమరస్‌ గ్లింప్స్‌ ద్వారా సినిమా టైటిల్‌ను రిలీజ్‌ చేశారు. దర్శకుడు కిషోర్‌ తిరుమల వాయిస్‌ ఓవర్‌లో వివరించిన టెంపుల్‌ అనౌన్స్మెంట్‌తో గ్లింప్స్‌ ప్రారంభమవుతుంది. ఈ అనౌన్స్మెంట్‌ గురించి రవితేజ క్యారెక్టర్‌ మాట్లాడుతూ, ‘నా జీవితంలోని ఇద్దరు ఆడాళ్లు నన్ను రెండు ప్రశ్నలు అడిగారు. సమాధానం కోసం చాలా ఆలోచించాను. గూగుల్‌ ఏఐ అన్నిటిని అడిగాను. మేబి వాటికి పెళ్లి కాకపోవడం వల్ల నన్ను ఇంకా కన్ఫ్యూజ్‌ చేశాయి. అనుభవం ఉన్న మగాళ్ళని ముఖ్యంగా మొగుళ్ళని అడిగాను.

ఆశ్చర్యపోయారే తప్పా ఆన్సర్‌ మాత్రం ఇవ్వలేకపోయారు. అలాంటి ప్రశ్న మిమ్మల్ని ఏ ఆడవాళ్లు ఆడకూడదని, పెళ్లయిన వాళ్ళకి నాలాంటి పరిస్థితి ఎదురవకూడదని కోరుకుంటూ.. మీ ఈ రామసత్యనారాయణ చెప్పేది ఏమిటంటే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి” అంటూ తనను రామ సత్యనారాయణగా పరిచయం చేసుకోవడం, భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్‌ రివీల్‌ కావడం అందర్నీ అలరిస్తోంది అని చిత్రయూనిట్‌ తెలిపింది. ప్రస్తుతం రవితేజ, ఆషికా రంగనాథ్‌, డింపుల్‌ హయతి పై ఒక ఎనర్జిటిక్‌ డ్యాన్స్‌ నెంబర్‌ను హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. టైటిల్‌ గ్లింప్స్‌ ద్వారా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కానుందని మేకర్స్‌ ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -