Tuesday, November 11, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్‌లో జోరుగా పోలింగ్..జూబ్లీహిల్స్‌లో మంద‌గ‌మ‌నం

బీహార్‌లో జోరుగా పోలింగ్..జూబ్లీహిల్స్‌లో మంద‌గ‌మ‌నం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: నేడు బీహార్‌లో రెండో దశ పోలింగ్‌ 11 గంటలకు 31.38 శాతం నమోదైంది. కిషన్గంజ్లో అత్యధికంగా 34.74 శాతం పోలింగ్ నమోదైంది. తక్కువ పోలింగ్ 28.66 శాతం పోలింగ్ మధుబాణిలో నమోదైంది.ఉదయం 9 గంటలకు 14.55 శాతం పోలింగ్‌ నమోదైంది.

నవంబర్‌ 6న జరిగిన మొదటి దశ పోలింగ్‌ కంటే ఈరోజు నమోదైన పోలింగ్‌ ఎక్కువ అని భారత ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ దశ పోలింగ్‌ 20 జిల్లాల్లో జరగనుంది. ఇప్పటివరకు గయా జిల్లాల్లో 15.97 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆ తర్వాత కిషన్‌గంజ్‌ 15.81 శాతం, జుమాయి 15.77 శాతం రికార్డు శాతం పోలింగ్‌ నమోదైంది. ఇక మధుబానిలో 13.25 తక్కువ శాతం పోలింగ్‌ నమోదైంది. అరారియా 15.34 శాతం, అర్వాల్‌ 14.95 శాతం, ఔరంగాబాద్‌ 15.43 శాతం నమోదయ్యాయి.

మ‌రోవైపు జూబ్లీహిల్స్ లో ఓటర్లు ఓటేసేందుకు బద్దకిస్తుతున్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్‍లో ఇప్పటి వరకు అత్యల్పంగా పోలింగ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనే నమోదు అవుతోంది. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన వివరాల ప్రకారం ఉదయం 11 గంటల వరకు జూబ్లీహిల్స్ లో కేవలం 20.76 శాతం మాత్రమే ఓటింగ్ నమోదు అయింది. ఈ నేపథ్యంలో ఇక ఓటర్లంతా పోలింగ్ కేంద్రాలకు రావాలని అభ్యర్థులు పిలుపునిస్తున్నారు. అయితే పోలింగ్ ముగిసే సమయానికి ఓట్ పర్సంటేజ్ పెరుగుతుందా లేక ఇలాగే మందకొడిగా సాగుతుందా అనేది హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -