నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో మహిత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య సేవలు నిర్వహించడం జరిగింది. మొదటగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రి సూపర్డెంట్ డాక్టర్ శివరాం ఈ కార్యక్రమంలో మార్చాల గ్రామానికి చెందిన మాజీ మార్కెట్ చైర్మన్ బాలయ్య, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు తలసాని కృష్ణారెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు కడల మల్లేష్ సంతోష్, మాజీ ఉపసర్పంచ్ మదన్మోహన్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు డొక్కా లింగం,దున్న భాస్కర్, కల్వకుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షులు వట్టేపు కిషోర్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు నిజాం సర్కార్, గ్రామ పెద్దలు వజ్ర లింగం, పల్స జంగయ్య గౌడ్, తాండ్ర తిరుపతి మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయడం జరిగింది. అదేవిధంగా మహిత హాస్పిటల్ హాస్పిటల్ వారు అనుభవజ్ఞులైన డాక్టర్ల చేత మార్చాల గ్రామంలో దాదాపుగా 400 పైచిలుకగా మందికి ఉచితంగా వైద్య సేవలు చేసి వారికి మందులు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మార్చాలా గ్రామం తరపున ఉచిత సేవలందించిన మహిత హాస్పిటల్ వారికి మార్చాల గ్రామం తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
మార్చాలలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



