నవతెలంగాణ-హైదరాబాద్: బిహార్‌లో మలి విడత పోలింగ్‌లో సాయంత్రం 5 గంటల వరకు 67.14% శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారలు వెల్లడించారు. కిషన్‌గంజ్ జిల్లాలో 76.26 శాతం, కతిహార్‌లో 75.23 , పూర్నియాలో 73.79 , సుపాల్‌లో 70.69 , పూర్వి చంపారన్‌లో 69.02 , బంకా.నవాడలో 68.91 , బంకా.నవాడలో సాయంత్రం 57.11 శాతం పోలింగ్ నమోదైంది.
ECI ప్రకారం. అరారియాలో 67.79 శాతం, అర్వాల్‌లో 63.06, ఔరంగాబాద్‌లో 64.48 , భాగల్పూర్‌లో 66.03, జహనాబాద్‌లో 64.36, కైమూర్ (భాబువా)లో 67.22 , పశ్చిమ చంపారన్‌లో 69.02, గయాలో 67.50 శాతం పోలింగ్ నమోదైంది. జముయిలో 67.81 శాతం, రోహ్తాస్‌లో 60.09, షియోహర్‌లో 67.31, సీతామర్హిలో 65.28, మధుబనిలో 61.79 శాతం పోలింగ్ నమోదైంది.
మొత్తం 20 జిల్లాల్లోని 122 నియోజకవర్గాల్లో.. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ కొనసాగింది. 3.7 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 1302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇటీవల 6తేదీని మొదటి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.



