Tuesday, November 11, 2025
E-PAPER
Homeఖమ్మంమెగా వైద్యశిబిరం విజయవంతం

మెగా వైద్యశిబిరం విజయవంతం

- Advertisement -

– పౌష్టికాహారం తోనే సంపూర్ణ ఆరోగ్యం
– ఐటీడీఏ పీఓ రాహుల్
నవతెలంగాణ – అశ్వారావుపేట

మన పరిసరాల్లో లభించే కాలానుగుణంగా లభించే ఆకుకూరలు, కూరగాయలు, ఉద్యాన పండ్లు ఆహారంతో తీసుకోవడం తోనే పౌష్టికాహారంగా ఉంటుందని, దీంతోనే సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని ఐటీడీఏ భద్రాచలం పీఓ రాహూల్ సూచించారు. ఐటీడీఏ పీఓ రాహూల్ సహాకారంతో,అదనపు డీఎం అండ్ హెచ్ఓ సైదులు పర్యవేక్షణలో వినాయక పురం పీహెచ్ సీ వైద్యాధికారి డాక్టర్ రాందాస్ ఆద్వర్యంలో మండలంలోని రెడ్డిగూడెం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన మెగా వైద్యశిబిరం విజయవంతంగా ముగిసింది.

ఈ శిబిరానికి వచ్చిన ఆయన అంగన్ వాడీ పిల్లలను పరిశీలించి రక్తహీనత,బలహీనంగా ఉండటం గమనించి అంగన్ వాడీ లో సరఫరా చేసే పౌష్టికాహారం తీసుకుంటున్నారా లేదా అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం పై విధంగా మాట్లాడారు.హాజరైన ప్రతీ ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించి,రోగ తీవ్రతను బట్టి సంబంధిత ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేయాలను వైద్యులకు ఆదేశించారు. ఈ వైద్య శిభిరం లో పలు మానసిక,శారీరక రుగ్మతలతో బాధపడే మొత్తం 625 మంది పాల్గొని వివిధ రోగాలకు చికిత్స పొందినారు. 

వీరిలో ముఖ్యముగా చిన్నపిల్లలు 66 మంది, గర్భిణీలు 37, కీళ్ళ నొప్పులతో 85 మంది, కంటి సమస్యలతో 36, ఊపిరితిత్తుల సమస్యలతో 55 మంది మరియు సాధారణ వ్యాధులతో 155 మంది హాజరై చికిత్స పొందినట్లు డాక్టర్ రాందాస్ తెలిపారు. వీరిలో అవసరమైన వారికి ఆయుర్వేద మందులు అందించినాము.అలాగే వీరిలో అవసరమైన వారందరికి ఎక్స్ రే, రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో జనరల్ మెడిసిన్ డాక్టర్ గోపినందన్, ఆర్థోపెడిక్ డాక్టర్ ఎన్.సైలేశ్,పిడియాట్రీసిన్ డాక్టర్ జీ.ప్రకాశ్,గైనకాలజిస్ట్ డాక్టర్ పి.మౌనిక,ఆప్తామాలజిస్ట్ డాక్టర్ బి. వెంకటేశ్వర్లు,యునాని వైద్యులు డాక్టర్ నౌసిన్, హోమియో వైద్యులు డాక్టర్ దీపిక,డాక్టర్ శాలినీ, చికిత్సలు అందించారు.ఈ శిభిరానికి రెడ్డిగూడెం పంచాయతీ నుండే కాకుండా తిరుమలకుంట, మామిళ్ళవారిగూడెం పంచాయతీ,మద్దులమడ, దురదపాడు పంచాయతీ ల నుండి గర్భిణీల ను, చిన్నపిల్లలను,ఆర్బీఎస్కే, ఎంఎం యూ,వాహనాలలో తరలించారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ చైతన్య,ఎన్టీఈపీ పీఓ డాక్టర్ పుల్లా రెడ్డి,డాక్టర్ శివ క్రిష్ణ,తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ,ఎంపీడీఓ బీ. అప్పారావు,ఎంపీఓ రామ కోటా రెడ్డి,కార్యదర్శి సందీప్ కుమార్,ఐసీడీఎస్ సీడీపీఓ ముత్తమ్మ,అంగన్ వాడీ,పీహెచ్ సీ  సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -