Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కువైట్ లో భర్త కనిపించడం లేదని వినతి

కువైట్ లో భర్త కనిపించడం లేదని వినతి

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
గత 25 రోజుల నుండి కువైట్ లో తన భర్త భూక్య ఈశ్వర్ ఆచూకీ కనిపించడం లేదని  హస కొత్తూర్ గ్రామానికి చెందిన అతని భార్య భూక్య సుగుణ మంగళవారం హైదరాబాద్ ప్రవాస ప్రజావాణి ఇంచార్జ్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్  చిన్నా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర గల్ఫ్ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మను భీమ్ రెడ్డినీ కలిసి విన్నవించారు. 15 సంవత్సరాల నుండి బతుకుతెరువు కోసం తన భర్త కువైట్ వెళుతున్నాడని, రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి మన దేశానికి వచ్చి పోయేవాడని పేర్కొన్నారు. ఈసారి కూడా వస్తున్నా అని చెప్పిన  కానీ 25 రోజుల నుండి ఫోన్ పనిచేయడం లేదన్నారు. అతని ఆచూకీ తెలియడం లేదని, నా భర్తను ఎలాగైనా ఆచూకీ కనుగొని కువైట్ నుండి మన దేశానికి రప్పించవలసిందిగా సుగుణ వేడుకున్నారు. వెంటనే స్పందించిన చిన్నారెడ్డి అక్కడ ఉన్న సంబంధిత ఐఏఎస్ ఆఫీసర్ తో మాట్లాడి మన దేశ ఎంబసీకి సమాచారం ఇచ్చి, మన దేశానికి పూజ ఈశ్వర్ ను రప్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గల్ఫ్ ప్రవాస సంఘం సభ్యులు సురేందర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పడిగేలా ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -