నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండల కేంద్రంలోని దోస్తుపల్లి వెళ్లే రోడ్డు మార్గంలో మార్కెట్ కమిటీ సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం, గ్రామాల వారిగా రూకం వేయడం జరుగుతుందని దుక్కం మండలం వ్యవసాయ అధికారిని మహేశ్వరి మంగళవారం ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎవో మహేశ్వరి మాట్లాడుతూ.. ఏ కొనుగోలు కేంద్రాల వద్ద సమస్యలు తాగే విధంగా గ్రామాల వారిగా సోయ కొనుగోలు ఏర్పాటు చేసి రద్దీ కలుగుతుందా రైతులకు సౌకర్యంగా ఉండేవిధంగా మండల కేంద్రంలోని పెనుగోలు కేంద్రం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రైతులు హృదయాన్ని కొనుగోలు కేంద్రానికి తెచ్చే ముందు బాగా ఆరబెట్టి 12 శాతం ఉండేవిధంగా, నిబంధనల ప్రకారం ప్రేమ ఉన్న వాటికి ప్రభుత్వం మద్దతు ధర రూ.5136/- ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
గ్రామాలలోని రైతులు వారికి కేటాయించిన తేదీలలోని కొనుగోలు కేంద్రానికి పోయాను తీసుకురావాలని సూచించారు. అదేవిధంగా తేదీల వారీగా గ్రామాలను ఎంపిక చేసి షెడ్యూల్ విడుదల చేశారు. విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం లొంగన్ మరియు చిన్నగుల్లా గ్రామాలకు నవంబర్ 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు భూకం వెయ్యడం జరుగుతుందని అన్నారు. బిజ్జాల్వాడి మరియు కత్తల్ వాడి గ్రామాలను నవంబర్ 14వ తేదీ నుండి 17వ తేదీ వరకు, మాదాపూర్, చెండేగావ్ గ్రామాలను నవంబర్ 18వ తేది నుండి 21 వ తేది వరకు , గుండూర్ మరియు మైబాపూర్ గ్రామాల రైతులకు ఈనెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు, ఖానాపూర్, జుక్కల్ గ్రామాల్లో రైతులు ఈనెల 25వ తేదీ నుండి 29వ తేది వరకు, దోస్తు పల్లి మరియు బంగారు పల్లి గ్రామాల రైతులకు డిసెంబర్ ఒకటివ తేదీ నుండి రెండవ తేదీ వరకు , కట్టాలి 3 వ తేదీన, కడంపల్లి గ్రామం రైతులకు డిసెంబర్ 4వ తేదీ నుండి ఆరవ తేదీ వరకు, పెద్ద ఏడ్గి రైతులకు డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి 10 వ తేదీ వరకు , నాగల్ గావ్ గ్రామ రైతులకు 11 మరియు 16 వరకు , హంగర్గా 17 మరియు 29 వ తేదీ వరకు , పెద్దగుల్లా మరియు గుల్లాతాండ రైతులకు20 వ తేదీ నుండి 23వ తేదీ వరకు తూకం వేయడం జరుగుతుంది రైతులకు తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని ఈ గ్రామాల రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మిగతా గ్రామాల షెడ్యూలు రెండవ విడతగా ఖండేబల్లూర్ సొసైటీ పరిధిలోని గ్రామాల వారికి మంగళవారం నడి షెడ్యూల్ విడుదల చేసి తెలియజేస్తామని అన్నారు.



