Tuesday, November 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీడీవో..

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన ఎంపీడీవో..

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని కత్తల్ వాడి గ్రామంలో ఇందిరమ్మ గృహ పథకంలో భాగంగా మంజూరైన లబ్ధిదారుల ఇంటి నిర్మాణాలను విక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ మార్కౌట్ చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. మండలంలోని గ్రామాలలో ఇందిరమ్మ గృహ పథకంలో ఇండ్ల మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను సరిత గతిన చేపట్టాలని సూచించారు. గ్రామాలలో గృహ నిర్మాణాలు చేపడుతున్న లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సూచించిన కొలతలను పాటించి నిర్మాణాలు చేపట్టాలని ఒకవేళ ప్రభుత్వాన్ని నిబంధనలను ఉల్లంగించి నిర్మాణాలు చేస్తే వాటికి బిల్లులు మంజూరు చేయడం జరగదని లబ్ధిదారులకు సూచించారు. సాంకేతికంగా ఏవైనా సమస్యలు ఉంటే ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి దరఖాస్తు పెట్టుకోవాలి సమస్యను పరిష్కరించి వారి సహకరిస్తామని ఎంపీడీవో శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతోపాటు గ్రామపంచాయతీ కార్యదర్శి , గృహ నిర్మాణాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -