- Advertisement -
ఆలయ ఈవో లక్ష్మి ప్రసన్న
నవతెలంగాణ – పాలకుర్తి
శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో కొబ్బరికాయలు, పూజా సామాగ్రి అమ్ముకునే హక్కు కోసం ఈనెల 14న (శుక్రవారం) ఉదయం 11గంటలకు సీల్డ్ టెండర్, బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. మంగళవారం లక్ష్మీ పసన్న మాట్లాడుతూ.. పూజా సామాగ్రిలో అభిషేకం వాహన పూజ సామాగ్రి మినహాయింపు ఉంటుందని తెలిపారు. సీల్డ్ టెండర్లతోపాటు బహిరంగ వేలంలో పాల్గొనేవారు ఈనెల 13న సాయంత్రం ఐదు గంటల వరకు ఆలయంలో ఉన్న బుకింగ్ కార్యాలయంలో వెయ్యి రూపాయలు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
- Advertisement -



