నవతెలంగాణ – మల్హర్ రావు
జాతీయ మాల మహానాడు చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధనసభను ఈ నర్ల 26న నిర్వహిస్తున్న కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్నీ మండలంలోని కొయ్యుర్ లో మాలమహనాడు మండల బాద్యుడు పసుల పోచయ్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని నియోజక వర్గ ఇన్చార్జ్ కందుల రాజన్న మాట్లాడుతూ.. నవంబర్ 26న రాజ్యాంగం అమలైన రోజును పురస్కరించుకొని జాతీయ మాల మాల మహానాడు జాతీయ అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగే రాజ్యాంగ సభకు ప్రతి ఒక్క మాల అంబేద్కర్ అభిమానులు రాజ్యాంగ అభిమానులు రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందే ప్రతి కార్యకర్త పార్టీలకతీతంగా ఈ యొక్క చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాల పోచమ్మల్లయ్య,భూపాల్ పల్లి జిల్లా యువత అధ్యక్షులు సకినాల ప్రశాంత్, మండల మహిళా అధ్యక్షురాలు కొండ రాజమ్మ తోపాటు నాయకులు పాల్గొన్నారు.
మాలమహనాడు ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ.!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



