Wednesday, November 12, 2025
E-PAPER
Homeసినిమామేల్‌ ఫెర్టిలిటీ నేపథ్యంలో..

మేల్‌ ఫెర్టిలిటీ నేపథ్యంలో..

- Advertisement -

విక్రాంత్‌, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర ఎంటర్‌టైన్‌మెంట్‌, నిర్వి ఆర్ట్స్‌ బ్యానర్స్‌ పై మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్‌ రెడ్డి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు డైరెక్టర్స్‌ బాబీ, సందీప్‌ రాజ్‌, శైలేష్‌ కొలను, బీవీఎస్‌ రవి, ప్రొడ్యూసర్‌ లగడపాటి శ్రీధర్‌ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
డైరెక్టర్‌ సంజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ, ‘మన సొసైటీలో ఇప్పుడు సంతాన లేమి అనే సమస్య ఎక్కువగా ఉంది. అన్నీ బాగుండి లైఫ్‌ స్టైల్‌ వల్ల సంతాన లేమితో బాధపడేవారిని ఈ మూవీలో అడ్రస్‌ చేశాం. మీరు ట్రైలర్‌ చూస్తే మంచి లవ్‌ స్టోరీ ఉంది, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్‌ ఉన్నాయి. వాటితో పాటు చిన్న మెసేజ్‌ కూడా ఉంది. ఇదే మా సినిమా’ అని అన్నారు.
‘ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్న ఒక క్లీన్‌ ఫ్యామిలీ మూవీ నిర్మించాం. బాలీవుడ్‌లో ఆయుశ్మాన్‌ ఖురానాలా మన తెలుగులో విక్రాంత్‌ పేరు తెచ్చుకుంటాడు. మా హీరోయిన్‌ చాందినీ ఆకట్టుకునేలా నటించింది’ అని నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి చెప్పారు. నిర్మాత నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ,’మా సినిమాకు రిలీజ్‌ ముందే మంచి అప్లాజ్‌ వస్తోంది. సినిమా హిట్‌ అనే పాజిటివ్‌ నెస్‌ కనిపిస్తోంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -