‘నార్త్ ఈస్ట్ కనెక్ట్’ ప్రోగ్రాంలో భాగంగా ఈ నెల 21,22 తేదీల్లో హైదరాబాద్‌లోని ఐమాక్స్‌లోని స్క్రీన్ -4, స్క్రీన్ -5లలో పలు భాషల సినిమాలను ప్రదర్శించనున్నట్లు సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సిహెచ్.ప్రియాంక తెలిపారు.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 8 సినిమాలతో పాటు 4 తెలుగు సినిమాలు ఈ ప్రదర్శనలో ఉంటాయని చెప్పారు. ఆయా సినిమాల దర్శకులు, ఇతర ప్రముఖులు ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారని, సాంస్కృతిక వైవిధ్యాన్ని అవగాహన చేసుకోవడానికి ఈ సినిమా ప్రదర్శలను ప్రజలు తిలకించాలని ఆమె కోరారు. మంగళవారం ఐమాక్స్ థియేటర్‌ను స్పెషల్ కమిషనర్ ప్రియాంక సందర్శించి, సినిమాల ప్రదర్శనకు, ఆహ్వానితులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులకి, థియేటర్ నిర్వాహకులకు సూచించారు.
‘నార్త్ ఈస్ట్ కనెక్ట్ – ఏ టెక్నో కల్చరల్ ఫెస్టివల్ :2025’లో భాగంగా వివిధ వేదికలపై ఐటి, కల్చరల్ ప్రోగ్రామ్స్‌తో పాటు సినిమాలను టీపీఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్నారు
యావింగ్ (త్రిపుర), తార-ది లాస్ట్ స్టార్ సిక్కిం (నేపాలి), కూకీ (హిందీ), ఒన్నాత్ ఆఫ్ ది ఎర్త్ (మేఘాలయ), అనుర్ (అస్సామీ), బూంబారైడ్ (అస్సామీ), ఎకోజీ యుమ్(మణిపురి), రాడార్, పాఖీ (అస్సామీ) వంటి ఇతర భాషా చిత్రాలతో పాటు బలగం, నా బంగారు తల్లి, పొట్టేల్, మల్లేశం వంటి తెలుగు సినిమాలూ ప్రదర్శితం కానున్నాయి.
ఐమాక్స్‌లో భిన్న భాషా చిత్రాల ప్రదర్శన
- Advertisement -
- Advertisement -



