‘గోపి గాళ్ల గోవా ట్రిప్’ సినిమాను రాస్తా ఫిల్మ్స్, ఔరా ఉలిస్ ఆర్ట్స్, అవ్వల్ నెంబర్ ప్రొడక్షన్స్, అవంతి సినిమా సంయుక్తంగా నిర్మించారు. అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం.. తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సాయి కుమార్, సీతా రామరాజు, రమణా రెడ్డి నిర్మాణంలో రోహిత్ – శశి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈనెల 14న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్లు రోహిత్, శశి మాట్లాడుతూ, ‘ఈ సినిమాకి మొత్తం ముగ్గురు ప్రొడ్యూసర్లు. ఈ సినిమాను మొదటిసారి మొదలుపెట్టారు. ఈ ఐడియా చెప్పిన 15వ రోజు షూటింగ్‌లో ఉన్నాం. గద్వాల్ డిస్ట్రిక్ట్‌లోని ఒక రిమోట్ విలేజ్‌లో షూటింగ్ స్టార్ట్ అయింది. ఇది ఒక రకమైన రూట్ ఫిలిం. హైవే మీద ట్రావెల్ చేస్తూ గోవా దాకా రీచ్ అయ్యే మధ్యలో షూటింగ్ చేసాం. సినిమా 90% సినిమా అవుట్ డోర్‌లోనే ఉంటుంది. ఈ సినిమా.. చిల్డ్ బీర్ లాంటి మూవీ’ అని తెలిపారు.
పుష్ప ఫేమ్ జగదీష్ (కేశవ) మాట్లాడుతూ, ‘రోహిత్, శశి దర్శకత్వం వహించిన ‘నిరుద్యోగ నటులు’ వెబ్ సిరీస్‌తో నటుడిగా నాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమా విపరీతమైన పాపులారిటీని తీసుకువచ్చింది. ఇందులోనూ మంచి పాత్ర పోషించాను. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. నటుడు సాయికుమార్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా ఇండిపెండెంట్ ఫిలిమ్స్‌లో మాగమోపస్ లాంటిది. ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ అందరూ ఎంకరేజ్ చేయండి’ అని తెలిపారు.
ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే గోవా.. ట్రిప్
- Advertisement -
- Advertisement -



