అల్లరి నరేష్ నటిస్తున్న కొత్త చిత్రం ’12ఎ రైల్వే కాలనీ’. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో ‘పోలిమేర’ సిరీస్ ఫేమ్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను లాంచ్ చేశారు. హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ,’నేను ఇప్పుడు వరకు చాలా జోనర్స్ చేశాను. కానీ ఇలాంటి థ్రిల్లర్ ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం ఇలాంటి జోనర్ ట్రై చేస్తే బాగుంటుందనిపించింది. చాలా మల్టీ లేయర్స్ ఉండే కథ. చాలా రేసి ఎగ్జైటింగ్ సినిమా ఇది. డైరెక్టర్ నాని సినిమాని చాలా అద్భుతంగా తీశాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఎవరు విలన్ అవుతారనేది గెస్ చేయలేరు. ఆడియన్స్ అందర్నీ చాలా థ్రిల్ చేస్తుంది.ఈ సినిమా ఈనెల 21న మీ ముందుకు వస్తుంది’ అని తెలిపారు.
డైరెక్టర్ నాని మాట్లాడుతూ,’సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ ఉన్నాం. ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు. షో రన్నర్ అనిల్ మాట్లాడుతూ,’మంచి కథతో, డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వస్తున్న సినిమా ఇది. ‘పొలిమేర’లాగానే ఇది కూడా ఒక డిఫరెంట్ సినిమా. ఈ సినిమా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా ఉంటుంది. సస్పెన్స్ థ్రిల్లర్స్‌ని ఎంజారు చేసే ఆడియన్స్‌కి ఇది మంచి ట్రీట్‌లా ఉండబోతుంది’ అని చెప్పారు.
డిఫరెంట్ స్క్రీన్‌ప్లే..
- Advertisement -
- Advertisement -



