Wednesday, November 12, 2025
E-PAPER
Homeసినిమా'కాంత'లో కుమారిగా..

‘కాంత’లో కుమారిగా..

- Advertisement -

దుల్కర్‌ సల్మాన్‌ మోస్ట్‌ ఎవైటెడ్‌ పీరియాడికల్‌ డ్రామా ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌. దుల్కర్‌ సల్మాన్‌ ‘వేఫేర్‌ ఫిల్మ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’, రానా దగ్గుబాటి ‘స్పిరిట్‌ మీడియా’ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టీజర్‌, ట్రైలర్‌, పాటలు అద్భుతమైన రెస్పాన్స్‌ తో మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. నవంబర్‌ 14న ఈ సినిమా గ్రాండ్‌ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ బోర్సే సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
ఇది నాకు చాలా స్పెషల్‌ ఫిల్మ్‌. కుమారిగా ఫుల్‌ పెర్ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ చేశాను. ఓ న్యూ కమ్మర్‌కి ఇలాంటి క్యారెక్టర్‌ దొరకడం అదష్టం. ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ఈ క్యారెక్టర్‌ చేశాను. ఈ సినిమా కోసం పాత తెలుగు, తమిళం సినిమాలు చూశాను. శ్రీదేవి, సావిత్రి నటన గమనించాను. వాటన్నిటినీ ఇన్స్పిరేషన్‌గా తీసుకుని కుమారిని కొత్తగా రీక్రియేట్‌ చేశాం.
డైరెక్టర్‌ సెల్వ చాలా టాలెంటెడ్‌. కుమారి క్యారెక్టర్‌ని ఆయన రాసుకున్న విధానం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇప్పటివరకు నన్ను ఒక కమర్షియల్‌ పెర్ఫార్మర్‌ అన్నారు. ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీని ఒక పర్ఫార్మర్‌ కూడా అంటారని ఆశిస్తున్నాను. ఈ సినిమా నాకు నటించే అవకాశాన్ని ఇచ్చింది.
దుల్కర్‌, రానాతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ‘కాంత, ఆంధ్ర కింగ్‌’ ఈ రెండు కూడా సినిమాతో ముడి పడిన కథలు. అయినప్పటికీ ఇందులో సినిమాలో సినిమా ఉంటుంది. ‘ఆంధ్ర కింగ్‌’ ఒక ఫ్యాన్‌ బయోపిక్‌. ఈ రెండు కూడా దేనికవే డిఫరెంట్‌ సినిమాలు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -