Wednesday, November 12, 2025
E-PAPER
Homeసినిమా'గత వైభవం' విజువల్స్‌ అద్భుతం

‘గత వైభవం’ విజువల్స్‌ అద్భుతం

- Advertisement -

హీరో నాగార్జున
ఎస్‌ఎస్‌ దుష్యంత్‌, ఆషికా రంగనాథ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫాంటసీ డ్రామా ‘గత వైభవం’. సింపుల్‌ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్‌ స్క్రీన్స్‌, సుని సినిమాస్‌ బ్యానర్స్‌ పై దీపక్‌ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేయనున్నారు.
మంగళవారం మేకర్స్‌ నిర్వహించిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి హీరో నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, ‘నాకు గత జన్మల సినిమాలంటే చాలా ఇష్టం. నాన్న ఏయన్నార్‌ సినిమా ‘మూగమనసులు’తో నాకు బాగా పరిచయం. నేను అదే ఇష్టంతో ‘జానకి రాముడు’ సినిమా చేశాను. రెండు సినిమాలు చాలా సూపర్‌ హిట్‌ అయ్యాయి. గత జన్మలు అనేది మన కల్చర్‌లో ఉండిపోయిన ఒక కథ. మనం చిన్నప్పుడు నుంచి వింటుంటాం. ‘గత వైభవం’ నాలుగు జనరేషన్ల కథ, ట్రైలర్‌ చూస్తుంటే ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. దుష్యంత్‌ స్క్రీన్‌ మీద ఫెంటాస్టిక్‌ గా కనిపిస్తున్నాడు. ఆషికా అద్భుతమైన నటి. ఈ సినిమా బాగా ఆడాలి. ‘హనుమాన్‌’ లాంటి సినిమాను అందించిన చైతన్య ఈ సినిమాని రిలీజ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. విజువల్స్‌ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద బ్లాక్‌ బస్టర్‌ కావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -