Wednesday, November 12, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయందేశ రాజకీయ రంగం నుంచి అతి మితవాదం అదృశ్యం

దేశ రాజకీయ రంగం నుంచి అతి మితవాదం అదృశ్యం

- Advertisement -

వెనిజులా అధ్యక్షుడు మదురో వ్యాఖ్యలు
కారకస్‌ :
దేశ రాజకీయ రంగం నుంచి అతి మితవాదం పూర్తిగా అదృశ్యమైందని వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో వ్యాఖ్యానించారు. ఇకపై దేశంలో అతి మితవాదం చురుకైన రాజకీయ శక్తిగా వుండబోదని చెప్పారు. సామ్రాజ్యవాదం నుండి ఎదురయ్యే ముప్పులు, బెదిరింపులను ఎదుర్కొనడమే మితవాదులకు మిగిలిన పని అని ఆయన వ్యాఖ్యానించారు. సమగ్ర బొలివారియన్‌ బేస్‌ కమిటీలు (సీబీబీఐ) ఏర్పాటు సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యునైటెడ్‌ సోషలిస్టు పార్టీ ఆఫ్‌ వెనిజులా (పీఎస్‌యూవీ) సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వెనిజులా ప్రజలు ఎల్లప్పుడూ శాంతినే కోరుకుంటారని ఆయన పునరుద్ఘాటించారు. ఈ భావనను వీధుల్లోకి, సోషల్‌ మీడియాలోకి, దేశ, అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్ళాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. అప్పుడే ప్రతిపక్షాల అసలు ఉద్దేశాలు బహిర్గతమవుతాయన్నారు. ”మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. ఆ అతి మితవాద శక్తులకు మిగిలిందేమిటి? బాంబు దాడులు జరపాలంటూ కేకలు, అమాయకులైన ప్రజలను హతమార్చాలంటూ నినాదాలు ఇవేగా వారికి మిగిలింది? అని మదురో ప్రశ్నించారు. ఇటువంటి అతి మితవాద శక్తులకు అంతర్గతంగా ఎలాంటి రాజకీయ శక్తి లేదన్నారు. అలాగే వారికి సామాజిక లేదా నైతిక బలం కూడా లేదన్నారు. వారికి నాయకత్వం కూడా లేదన్నారు. ఇటువంటి బూటకపు, క్రిమినల్‌ ఫాసిజం మళ్లీ తలెత్తకుండా మనం చర్యలు తీసుకోవాలని మదురో పిలుపిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -