Wednesday, November 12, 2025
E-PAPER
Homeజాతీయంబీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌

బీజాపూర్‌లో ఎన్‌కౌంటర్‌

- Advertisement -

ఆరుగురు మావోయిస్టుల మృతి
రూ.8 లక్షల రివార్డు ఉన్న బుచ్చన్న మరణం
నవతెలంగాణ-చర్ల

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. నేషనల్‌ పార్క్‌ దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా మావోయిస్టుతో సహా మోస్ట్‌ వాంటెడ్‌ పాపారావు భార్య ఊర్మిళతోపాటు మద్దేడు ఏరియా కమిటీ కమాండర్‌, రూ.8 లక్షల రివార్డు గల బుచ్చన్న ఉన్నారు. జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. బీజాపూర్‌ జిల్లాలోని నేషనల్‌ పార్క్‌ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారం ఆధారంగా బీజాపూర్‌, దంతెవాడ జిల్లాల డీఆర్‌జీ బలగాలు, ఎస్‌టీఎఫ్‌ సంయుక్త బృందం శోధన ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. మంగళవారం ఉదయం 10.00 గంటల నుంచి భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య అడపాదడపా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టుల మృతదేహాలతోపాటు ఆటోమేటిక్‌ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ సుందర్‌రాజ్‌ మాట్లాడుతూ.. పరారీలో ఉన్న ఇతర మావోయిస్టు క్యాడర్‌లను చుట్టుముట్టడానికి సిబ్బంది పోరాడుతున్నారని చెప్పారు.
మరోవైపు గరియాబంద్‌ జిల్లాలో నాలుగు గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల నుంచి మావోయిస్టులు తప్పించుకోగా.. పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని భద్రతాబలగాలు స్వాధీనం చేసుకున్నట్టు భద్రతాబలగాలు పేర్కొన్నాయి. మరోపక్క మావోయిస్టులను మట్టుబెడుతున్నారని పౌరసమాజం, ప్రజాహక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -