Sunday, June 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డా.రాజేంద్రప్రసాద్ కు ఘన సన్మానం ..

డా.రాజేంద్రప్రసాద్ కు ఘన సన్మానం ..

- Advertisement -

నవతెలంగాణ -కంఠేశ్వర్ : నిజామాబాద్ నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు, శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్ అందిస్తున్న ఉత్తమ వైద్య సేవలను గుర్తించి రాజ్ న్యూస్ ఆయనను విస్సా హెల్త్ ఎక్స్ పురస్కారానికి ఎంపిక చేసింది. హైదరాబాదులో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో డాక్టర్ రాజేంద్రప్రసాద్ విస్సా హెల్త్ ఎక్స్ పురస్కారం అందుకున్న సందర్భంగా ఆయనను గురువారం మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం ఘనంగా సన్మానించింది.శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో జరిగిన కార్యక్రమంలో చిరంజీవి అభిమాన సంఘం జిల్లా సలహాదారులు బి.చంద్రశేఖర్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని అన్నారు.వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న జిల్లాకు చెందిన డాక్టర్ రాజేంద్రప్రసాద్ కు విస్సా ఎక్స్ హెల్త్ పురస్కారం దక్కడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట కార్యదర్శి బింగి మోహన్, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గుండ సంతోష్, చిరంజీవి అభిమాన సంఘ నాయకులు శ్రీధర్, నవీన్, శంకర్ ,రమేష్, పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -