Wednesday, November 12, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం..ఆత్మాహుతి దాడి కాదు..!

ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం..ఆత్మాహుతి దాడి కాదు..!

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఢిల్లీ బాంబు పేలుడు కేసులో కొత్త కోణం వెలుగుజూసింది. ఐఈడీ రవాణా చేస్తుండగా పేలి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐఈడీని మరో చోటుకు తరలిస్తున్న క్రమంలో.. దారిలో ప్రమాదవశాత్తు పేలి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. పేలుడు ఘటనలో మృతిచెందిన బాధిత కుటుంబాలకు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఈ పేలుడులో 13 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. శాశ్వత అంగవైకల్యం కలిగిన వారికి రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -