Wednesday, November 12, 2025
E-PAPER
Homeకరీంనగర్రాజన్న దర్శనాలు నిలిపివేతతో భక్తుల్లో నిరాశ..

రాజన్న దర్శనాలు నిలిపివేతతో భక్తుల్లో నిరాశ..

- Advertisement -

– వేములవాడ ఆలయంలో అధికారులు తాళం.. ముందస్తు సమాచారం లేక అయోమయం
నవతెలంగాణ-వేములవాడ : తెలంగాణలో ప్రముఖ దేవస్థానమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం భక్తుల దర్శనాలను ఆకస్మాత్తుగా నిలిపివేయడంతో భక్తులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనం కోసం రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులు ఆలయ ప్రధాన గేటు ఎదుట వేచి ఉన్నారు. అయితే, ఆలయ అధికారులు ముందస్తు ప్రకటన లేకుండా ప్రధాన గేటుకు తాళం వేయడంతో భక్తులు అయోమయానికి గురయ్యారు. గేటు వద్ద అడ్డంగా రేకులు ఏర్పాటు చేయడంతో భక్తుల ప్రవేశం పూర్తిగా నిలిపివేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, రాజరాజేశ్వర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్న కారణంగా భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చిందని తెలిపారు.ఇదే సమయంలో, భక్తులకు ప్రత్యామ్నాయంగా ఆలయ ప్రాంగణం ఎదుట ఏర్పాటు చేసిన ప్రచార రథం మీద ఉన్న ఎల్ఈడి స్క్రీన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పించారు.భక్తులు మాత్రం ముందుగా ప్రకటించి ఉంటే మేము ఈ ప్రయాణం చేసేవాళ్లం కాదు. కుటుంబ సభ్యులతో ఎంతో దూరం నుంచి వచ్చి స్వామివారి దర్శనం కల్పించకపోవడం పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రాజన్న ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తి అయ్యే వరకు భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -