నవతెలంగాణ-హైదరాబాద్: సోమవారం రాత్రి సంభవించిన కారు బాంబు పేలుళ్లతో దేశరాజధాని ఢిల్లీ ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటన నేపథ్యంలో ఢిల్లీ పరిసర ప్రాంతాలతో దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, రద్దీ ప్రాంతలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద సెక్యురిటీని కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను అలర్ట్ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానిత వ్యక్తులతో పాటు వస్తువులు కన్పించిన పోలీసులకు సమాచారం అందివ్వాలని సూచించారు. ఇప్పటికే క్లూస్ టీంతో ద్వారా పలు కీలక ఆధారాలను సేకరించారు. దర్యాప్తులో భాగంగా తాజాగా ఢిల్లీలోని ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో మరోసారి భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఎర్రకోట వద్ద మెట్రో స్టేషన్ పార్కింగ్ కారులో దుండగులు బాంబు అమర్చి పేల్చారు. ఈ దుర్ఘటనలో 13మంది దాకా మరణించగా, పలువురు తీవ్ర గాయాలతో ఆస్పత్రి చికిత్స పొందుతున్నారు.
మరోసారి ఎర్రకోట వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



