Wednesday, November 12, 2025
E-PAPER
Homeజాతీయంబీహార్ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌పై తేజ‌స్వీయాద‌వ్ కౌంట‌ర్

బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌పై తేజ‌స్వీయాద‌వ్ కౌంట‌ర్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత వెలువ‌డిన ఎగ్జిట్ పోల్స్ ఫ‌లితాల‌పై ఆర్జేడీ అగ్ర‌నేత‌, మ‌హాగ‌ఠ‌బంధ‌న్ సీఎం అభ్య‌ర్థి తేజస్వీయాద‌వ్ స్పందించారు. బీజేపీ సొంతంగా స‌ర్వే చేయించి, ప్ర‌చారం చేస్తుంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఓ ప‌క్క పోలింగ్ కొన‌సాగుతుండ‌గానే..మ‌రోవైపు ఎగ్జిట్ పోల్స్ హ‌డావిడి చేస్తున్నాయ‌ని మండిపడ్డారు. బీజేపీ నాయకుల ప్రోద‌ల్బంతోనే ఆత్రుతగా ఎన్డేయే కూట‌మికి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ వెలువ‌డ్డాయ‌ని ఆరోపించారు.

ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడు గంట‌ల‌కు సాగిన పోలింగ్ ప్ర‌క్రియ‌లో..బీహార రాష్ట్ర ప్ర‌జ‌లు ఓపిక‌తో నిల‌బ‌డి ఓట్లు వేశార‌ని కొనియాడారు. గంట‌ల త‌ర‌బ‌డి భారీ క్యూలైన్‌ల్లో నిల‌బ‌డి ఓట్లు వేసినందుకు ధ‌న్యవాదాలు తెలిపారు. న‌వంబ‌ర్ 14న వెలువ‌డ‌నున్న ఎన్నిక‌ల ఫలితాల‌తో.. 1995 నాటి ఫ‌లితాల రీపిట్ అవుతాయ‌న్నారు. లాల్ ప్ర‌సాద్ నాయ‌క‌త్వంలో మ‌రోసారి అద్భుత‌మైన ఫలితాలు సాధిస్తామ‌ని పాట్నా మీడియా స‌మావేశంలో దీమా వ్య‌క్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -