నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
పెన్షనర్ల సమస్యల పరిష్కారానికై 17న చలో ఇందిరాపార్క్ కార్యక్రమం చేపట్టినట్లు పెన్షనర్ల సంఘం తెలిపారు. ఐదు పెండింగ్ డిఏలు, మెడికల్ బిల్లులు, 2024 మార్చి నుండి రిటైర్ అయిన వారికి జిపిఎఫ్ రావలసిన బెనిఫిట్స్ ఇవ్వలేదన్నారు. రెండేళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ అధికారంలోకి వస్తే చేస్తామన్నారు. రెండు సంవత్సరాలు అవుతున్న ఇంతవరకు పెన్షన్ బెనిఫిట్స్, జిపిఎఫ్ కు సంబంధించిన దాచుకున్న డబ్బులు, సమస్యలన్నీ పెండింగ్లో పెట్టారన్నారు. ధర్నాలు చేసిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నది, జెఎసి ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ దగ్గర టెన్షనర్ల కుటుంబ సభ్యులతోపాటు ధర్నా చేయాలని నిర్ణయించామన్నారు. పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప, చాలామంది పెన్షనర్లు డబ్బులు రాకముందే చనిపోవడం జరుగుతుంది కానీ ప్రభుత్వానికి మన సమస్య అంటే చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఏదో ఒకటి తేల్చుకుందాం అని పెన్షనర్స్ అసోసియేషన్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు అబ్దుల్ బాబు ప్రధాన కార్యదర్శి శంకర ప్రభాకర్ సభ్యులు డిమాండ్ చేశారు.
17న ఛలో ఇందిరా పార్క్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



