చోద్యం చూస్తున్న అధికారులు
తూ తూ మంత్రంగా తనిఖీలు
నవతెలంగాణ – కాటారం
ఈసారి పత్తి దిగుబడిపై రైతులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ సాగు ప్రారంభంలో వర్షాలు రాక, ఎదిగిన క్రమంలో వర్షాలు వచ్చి పత్తిని, దాన్ని నమ్ముకున్న రైతును నిండా ముంచేసింది. దీంతో కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా భావించిన దళారులు రైతులకు మాయ మాటలు చెప్పి, అతి తక్కువ ధరకే పత్తిని కొని, రైతుల పొట్టకొడుతున్నారు. మార్కెట్ అధికారులు దళారులకు అమ్మొద్దని చెప్పడమే కానీ.. దానికి సరైన మద్దతు ధర ప్రభుత్వం నుంచి అందేలా చూస్తామని హామీ ఇవ్వలేకపోతున్నారు.
కాటారం మండలంలో ఈ ఏడు పత్తి సాగు 14000 ఎకరాల్లో మించలేదు. గతంలో పత్తి దిగుబడి ఎకరాకు 10 నుంచి 12 కింటలో రాగా ..ప్రస్తుత సీజన్లో భారీ వర్షాల కారణంగా వాతావరణం లోని పరిస్థితులు సరిగా లేకపోవడంతో ఎకరాకు మూడు నుంచి 6 కింటల్లా పత్తి మాత్రమే వస్తుంది. పండించిన కోస్తా పత్తిని అమ్ముకునేందుకు రైతులు నుంచి దళారులు పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేసి మరింత నష్టానికి గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సిసిఐలో పత్తి కింటాలుకు ఏ గ్రేడ్ ధర 8010రూ. ఉంది. కానీ దళారులు మాత్రం గ్రామాల్లో క్వింటాల్ పత్తికి 5000 నుంచి 5600 వరకు చెల్లిస్తున్నారు.
దళారులు ఎలక్ట్రిక్ కాంటాలు వినియోగించకపోవడంతో రైతులు మోసపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైతులకు సీసీఐ కేంద్రాలు అందుబాటులో లేకపోవడంతో దళారులను ఆశ్రయిస్తున్నారు. పైగా గ్రామాల్లోనే కొనుగోలు చేస్తుండడంతో రావణ ఖర్చులు ఆదా అవుతున్నాయని, రైతులు ఆలోచిస్తున్నారు. సీసీఐలో పత్తి కొనుగోలుకు ఏ రోజు పత్తిని విక్రయిస్తాము. ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. ఎక్కువమంది కౌలు రైతులు ఇదంతా ఎందుకులే అనుకోని దళారులకు విక్రయిస్తున్నారు.
ప్రస్తుతం సీసీఐ కేంద్రాల్లో సైతం ఎకరాలకు స్లాట్ బుక్ చేసుకుంటే ఏడు కింటలు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. గతంలో 12 క్వింటాళ్ల కొనుగోలు చేసేవారు. కొనుగోలు పూర్తయిన 10 నుంచి 20 రోజుల్లో రైతుల ఖాతాలోకి డబ్బులు జమ అయ్యేవి. కొంత మొత్తంలో నష్టం జరిగేది. కాని చిల్లర దళారులు చేయబట్టి పత్తి రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మార్కెట్ అధికారులు చొరవ తీసుకొని చిల్లర దళారీ వ్యవస్థ పైన చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.



