Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శ్రీశైలంలో ఉచిత వైద్య శిబిరం 

శ్రీశైలంలో ఉచిత వైద్య శిబిరం 

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ: కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రమునకు వచ్చి భక్తుల కోసం మండలానికి చెందిన డాక్టర్ చిలువేరు శ్రీను ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీను మాట్లాడుతూ.. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలం పుణ్యక్షేత్రమునకు వచ్చిన భక్తులకు, సత్రమునకు వచ్చిన యాత్రికులకు సాధారణ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశానన్నారు.గత 16 సంవత్సరాలుగా శ్రీశైలం పుణ్యక్షేత్రం నందు మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సత్రం మేనేజర్ ఏల్పుల కృష్ణ, అసిస్టెంట్ మేనేజర్ గోవిందరాజ్, సత్ర సిబ్బంది గిరిధర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -