Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పనులు ఆగకుండా చూసుకోవాలి: ఎస్ఈ రవీందర్

పనులు ఆగకుండా చూసుకోవాలి: ఎస్ఈ రవీందర్

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి : ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామ శివారులో రూ, 248.43లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన 33/11కెవి సబ్ స్టేషన్ నిర్మాణా పనులకు మొగ్గు వేయడానికి టిజీ ఎన్ పి డి సి ఎల్ ఎస్ ఈ రవీందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులతో మాట్లాడుతూ పనులు మొదలైన తర్వాత ఆగకుండా చూసుకోవాలని,ఏ సమస్యా వచ్చిన ముందుండి పనులను చేయించుకోనే విధంగా చూడాలని సూచించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి గత కొన్ని నెలల క్రితం శంకుస్థాపన చేశారని, సబ్ స్టేషన్ నిర్మంచే భూమి పై కేసు ఉండటంతో ఇన్ని రోజులు పనులు జరగలేదన్నారు.ఒకసారి పనులు మొదలైందంటే ఇకా ఆగకుండా పనులు పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.సబ్ స్టేషన్ నిర్మాణం కోసం 248.43లక్షలు మంజురయ్యయని వివరించారు.ఈ కార్యక్రమంలో డిఇ కన్స్ట్రక్షన్ వెంకట్ రమణా,ఈఈ సివిల్ కె స్వామి,ఎ డి కన్స్ట్రక్షన్ తోట రాజశేఖర్, డిచ్ పల్లి డిఇ ఆపరేషన్ కామేశ్వరరావు,ఏఈ కన్స్ట్రక్షన్ వినోద్, సివిల్ కార్తిక్, ఇందల్ వాయి ఏఈ పండరి నాథ్,లైన్ ఇన్స్పెక్టర్ తాజోద్దిన్, సబ్ ఇంజనీర్ సందీప్, తిర్మన్ పల్లి లైన్ మెన్ శ్రీనివాస్, అసిస్టెంట్ లైన్ మెన్ సంతోష్, తిర్మన్ పల్లి గ్రామ అభివృద్ది కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -