- Advertisement -
- – పీఆర్సి వెంటనే ప్రకటించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర నెంబర్ డి కిరణ్ కుమార్
నవతెలంగాణ – ధర్మసాగర్
సీనియర్ టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి, పీఆర్సి వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబర్ డి కిరణ్ కుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటిఎఫ్) ధర్మసాగర్ మండలం సభ్యత్వ నమోదు కార్యక్రమం లో భాగంగా మండలంలోని ఉనికిచర్ల, దేవునూరు, నారాయణగిరి, సాయిపేట, ముప్పారం,రాపాకపల్లి లోని పలు ప్రాథమిక ఉన్నత పాఠశాలలు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా టీఎస్ యూటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ మెంబర్ డి కిరణ్ కుమార్ మాట్లాడుతూ 2010 కన్నా ముందు సర్వీస్ లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వాలని, పీఆర్సి నివేదికను తెప్పించుకొని వెంటనే ప్రకటించాలని, పెండింగ్ బిల్స్ రిలీజ్ చేయాలని, క్లాస్ కి ఒక టీచర్ని కేటాయించి ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయాలని, సీపిఎస్ విధానం రద్దు చేసి అందరికీ పాత పెన్షన్ పథకం పునరుద్ధరించాలని కోరారు. - టీఎస్ యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ రవీందర్ రాజు మాట్లాడుతూ , అన్ని మేనేజ్మెంట్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు హెల్త్ కార్డ్స్ ఇచ్చి ఉచిత వైద్యం అందించాలని, రెసిడెన్షియల్ పాఠశాలల ఉపాధ్యాయులకు నెల మొదటి రోజున జీతాలు చెల్లించాలని, కేజీబీవీ ఉపాధ్యాయులకు సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని సమాన పనికి సమాన వేతనం వర్తింపజేస్తూ బేసిక్ పే ఇవ్వాలని తదితర డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యూటిఎఫ్ జిల్లా కార్యదర్శి చుంచుకాల లింగారావు, మండల బాధ్యులు డి.సురేష్, ఎ.గణేష్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



