Wednesday, November 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రసవాల నిర్వహణలో నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రి ముందంజ..

ప్రసవాల నిర్వహణలో నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రి ముందంజ..

- Advertisement -

నవతెలంగాణ – నల్లగొండ ప్రతినిధి
ప్రసవాల నిర్వహణలో నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి రాష్ట్రంలోనే ముందుందని అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో రూ.30 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల జారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ  తర్వాత ఎక్కువగా ప్రసవాలు నిర్వహించే అతిపెద్ద ఆస్పత్రిగా నల్లగొండ  జిజిహెచ్ పేరుపొందిందని, ప్రతినెల 700 నుండి 800 వరకు ప్రసవాలు చేయడం జరుగుతున్నదని ఆయన తెలిపారు.

గతంలో ఉన్న సదరం శిబిరం కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదని,  సౌకర్యాల లేమితో వైకల్యం కలిగిన వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడాన్ని దృష్టిలో ఉంచుకొని 30 లక్షల రూపాయల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మించి వికలాంగులకు కొత్త  భవనంలో తాగునీరు, టాయిలెట్స్, ర్యాంపు,ఇతర అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని  చెప్పారు. వైకల్యం కలిగిన వారు ఇక ప్రతివారం ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్లు పొందవచ్చని అన్నారు. ఇప్పటివరకు దృవపత్రాలు రాని వారికి ధ్రువపత్రాలు జారీ చేయడం జరుగుతుందని, సదరం  ధ్రువ పత్రాల ఆధారంగా పెన్షన్ రాని వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు ఏ ఇతర ఆస్పత్రిలో లేవని , ఆసుపత్రిలో అన్ని అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇటీవలే బేబీ వార్మ్స్, లాప్రోస్కోపిక్ మిషన్ వంటివి ఏర్పాటు చేయడం జరిగిందని, రెండు, మూడు లక్షల రూపాయల విలువ చేసే ఆపరేషన్లు సైతం ఉచితంగా  ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చేస్తున్నామని,ఇవి సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇంకా ఆస్పత్రికి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని, అవసరమైతే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సహకారం అందిస్తామని చెప్పారు. ప్రసవాల కోసం ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి రావాలని, ఇందుకు ఆశ, అంగన్వాడీ, ఆస్పత్రికి సిబ్బంది, అంబులెన్స్ వాహనాల డ్రైవర్లు, డాక్టర్లు కృషి చేయాలని మంత్రి  అన్నారు. వైద్య సేవలలో నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని రాష్ట్రం లోనే నంబర్ వన్ గా నిలపాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి,  ఆర్ డి ఓ వై.అశోక్ రెడ్డి,జిల్లా ఆస్పత్రి సూపరింటిండెంట్  అరుణ కుమారి, ఆర్ఎంవో ఇతర అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -