నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ సమాజ వికాసం కోసం, నవ తెలంగాణ నిర్మాణం కోసం శ్రమిస్తున్న తెలంగాణ జాగృతిని బలోపేతం చేయడంతో పాటు కార్యకలాపాలను విస్త్రుతం కోసం నిజామాబాద్ జిల్లా అడహక్ కమిటీని ఎర్పాటు చేసినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఓ ప్రకటన విడుదల చేశారు. నిజామాబాద్ జిల్లా అడహక్ కమిటీలో సభ్యులుగా సూదం రవిచంధర్, అవంతి కుమార్, ఏంఎ రజాక్, శ్రీనివాస్ గౌడ్ ఏలురి, లక్ష్మినారాయణ భరాద్వాజ్, మహ్మద్ రెహన్ అహ్మద్, నవీన్ పటేల్ లను, అధికార ప్రతినిధులుగా తెలంగాణ శంకర్, ద్యావడే సంజీవ్, శేఖర్ రాజ్, కోర్ర సంతోష్ నాయక్, తిరుపతిరాములను నియమించారు.
బోదన్ నియోజకవర్గం అడహక్ కమిటీలో దొంత ప్రవీణ్ కుమార్, నూర్ పతేపూర్, రాఘవేంధర్ యాదవ్, భవానిపేట్ శ్రీనివాస్, వై.సాయిలు లను నియమించారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అడహక్ కమిటీ.. కరిపే రాజు, మహ్మద్ రెహన్ అహ్మద్, ఇరుముల శంకర్, పంచరెడ్డి మురళి, యెండల ప్రసాద్, అంబటి శ్రీనివాస్ గౌడ్, సాయి క్రిష్ణ నేత, షానవాజ్ ఖాన్ లను నియమించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అడహక్ కమిటిలో భానోత్ నరేష్ నాయక్, బానోత్ ప్రేమ్ దాస్ లను, ఆర్మూర్ నియోజకవర్గం అడహక్ కమిటిలో ఏలేటి నవీన్ రెడ్డి, ఆక్నూరి మనోజ్ రావు, అహ్మద్ అజం లను, బాల్కొండ నియోజకవర్గ కమిటిలో సుంకేట మహేంధర్ రెడ్డి, కర్నాట ధీరజ్ లను నియమించారు.



