Wednesday, November 12, 2025
E-PAPER
Homeజిల్లాలు రోడ్ల వెడల్పుకు నిధులు మంజూరు

 రోడ్ల వెడల్పుకు నిధులు మంజూరు

- Advertisement -

నవతెలంగాణ (నందిపేట్ ) ఆర్మూర్ 

మండలంలోని చింరాజ్పల్లి,లక్కంపల్లి,తల్బేద గ్రామాలకు ఆర్ అండ్ బి రోడ్ ఇరుకుగా ఉందని అనునిత్యం ప్రమదాలు జరుగుతున్నాయని మూడు గ్రామాల పెద్దమనుషులు  అసెంబ్లీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కి విన్నవించినారు.దీంతో  వెంటనే వారు స్పందించి రోడ్ వెడల్పునకు ఆరుకోట్ల తొంబై మూడు లక్షలు మంజూరి చేయించినందుకు మూడు గ్రామాల ప్రజలు బుధవారం హర్షం వ్యక్తం చేసినారు.
నిధులు మంజూరు చేసిన ఆర్ అండ్ బీ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క , టీపీసీసీ అధ్యక్షులు మహేష్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి , ముఖ్యంగా ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి   కి ధన్యవాదాలు తెలిపారు .
వారం రోజుల్లో రోడ్ పనులు ప్రారంభం కానున్నాయి భూమిపూజ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్ ,బైండ్ల ప్రశాంత్ ,గంగయ్య గంగారెడ్డి ,సిరిగిరి శ్రీను ,ద్యావతి ముత్యం ,రాజశేఖర్ ,గాదె శ్రీను ,మన్నె సాగర్ ,బ్యాగరి జీవన్  తదితర నాయకులు,కార్యకర్తలు,గ్రామాల పెద్దమనుషులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -