Wednesday, November 12, 2025
E-PAPER
Homeజిల్లాలుశ్రీ అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

శ్రీ అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

- Advertisement -

– మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ చార్జి పబ్బు రాజుగౌడ్

నవతెలంగాణచౌటుప్పల్ రూరల్:

శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి సేవా ట్రస్ట్ కొయ్యలగూడెం ఆధ్వర్యంలో గత 9 ఏండ్ల నుండి మాల ధరించే భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. నిత్య అన్నదాన కార్యక్రమం శ్రీశ్రీశ్రీ వరసిద్ధి వినాయక వాయు మండల గణపతి దేవాలయం, కొయ్యలగూడెం పద్మావతి బుధవారం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా పబ్బు రాజు గౌడ్, వి.రాజు పాల్గొన్నారు. పబ్బు రాజు గౌడ్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా అయ్యప్ప సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన వితరణ కార్యక్రమం ట్రస్ట్ సభ్యులను అభినందించారు.

వి.రాజు మాట్లాడుతూ అయ్యప్ప మాల ధరించిన అయ్యప్ప స్వాములకు అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసిన ట్రస్టు సభ్యులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు, బోయ దేవేందర్, అయ్యప్ప సేవా ట్రస్ట్ అధ్యక్షులు రవ్వ సంతోష్ కుమార్ గురు స్వామి, కోయిలగూడెం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాచర్ల సంతోష్, అయ్యప్ప స్వామి సేవా సమితి ట్రస్ట్ స్వాములు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -