Thursday, November 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంచందంపేట మండలం గువ్వల గుట్టలో ఉద్రిక్తత

చందంపేట మండలం గువ్వల గుట్టలో ఉద్రిక్తత

- Advertisement -

అటవీ శాఖ సిబ్బంది.. గ్రామస్తుల మధ్య ఘర్షణ
దాడి చేశారంటూ ఫారెస్టు అధికారుల ఫిర్యాదు
పోలీసుల కేసు నమోదు


నవతెలంగాణ- దేవరకొండ
అటవీ భూమి సాగు విషయం లో అధికారులు అడ్డుకోవడంతో గ్రామస్తులు, అటవీ సిబ్బంది మధ్య వాగ్వాదం, తోపులాట జరగ్గా.. గ్రామస్తులు తమపై దాడి చేసినట్టు అటవీ సిబ్బంది ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చందం పేట మండలం కంబాలపల్లి రేంజ్‌ పరిధిలోని గువ్వలగుట్టలో బుధవారం జరిగింది. ప్రకటనలో అటవీ శాఖ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. కంబాలపల్లి ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలో గువ్వలగుట్ట సమీపంలో అటవీ శాఖకు చెందిన భూమికి గ్రామస్తులు హద్దులు వేస్తుండటంతో సిబ్బంది అడ్డు కున్నారు.

ఈ క్రమంలో రెండు మూడుసార్లు గొడవ జరిగింది. అటవీ శాఖ భూమిలోకి గిరిజనులు వచ్చి సాగుచేస్తుండగా బుధవారం ఎఫ్‌డీఓ ఎన్‌ ఆర్‌.సంగీత ఆధ్వర్యంలో సిబ్బంది వెళ్లి అడ్డుకున్నారు. పట్టా ఉన్న భూములనే సాగు చేసుకోవాలని, పట్టా కాగితాలు చూపించాలని ఫారెస్ట్‌ అధికారులు రైతులను అడిగారు. అనంతరం వాగ్వాదం.. తోపులాట జరిగింది. గ్రామస్తులు పలువురు అటవీ సిబ్బందిపై దాడి చేయడంతో చేశారు. ఈ ఘటనపై అటవీ శాఖ అధికారులు చందంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

గువ్వలగుట్టలో జరిగిందేంటీ..
స్థానికులు కొందరు చెప్పిన వివరాల ప్రకారం.. చందంపేట మండలం గువ్వలగుట్ట గిరిజనులకు వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో హక్కు పత్రాలు ఇచ్చారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో పనిచేసిన తహసీల్దార్‌ అడిగిన వారందరికీ పట్టాలు ఇచ్చారు. భూమి తక్కువ ఉండటం.. పట్టా హక్కు పత్రాలలో ఎక్కువగా ఉండటంతో గిరిజనులు అటవీ భూములలో సాగుపై దృష్టి పెట్టారు. గువ్వలగుట్ట సమీపంలో సక్కుపాయ ప్రాంతంలో 10 కుటుంబాలు 25 నుంచి 30 ఎకరాల భూమిని తాతల ముత్తాతల నుంచి సాగు చేసుకుంటూ ఉన్నారు. హక్కు పత్రాలు ఇచ్చిన భూములలో అటవీ శాఖ నిబంధనల ప్రకారం స్తంభాలు, బోర్లు వేసుకోవడం, ట్రాక్టర్లతో సేద్యం చేయడం నిషేధం.

నాగలితోనే సేద్యం చేయాలి. ఇటీవల కాలంలో నాగార్జునసాగర్‌ వెనుక భాగంలో ఉన్న నీటిని కరెంటు మోటార్ల ద్వారా తీసుకొని పత్తి వేసుకున్నారు. ఇలా చేయకూడదని ఫారెస్ట్‌ అధికారులు హెచ్చరించారు. ఫారెస్ట్‌ సిబ్బంది అక్కడే ఉన్న రైతు మూడవత్‌ లాలును తమ వాహనంలో ఎక్కించుకుని తీసుకెళ్లారు. మార్గమధ్యంలో రోడ్డు మీద ఉన్న ఆంజనేయ స్వాములకు వాహనం ఢకొీట్టింది. దీంతో ఆంజనేయ స్వాములతో పోలీసులకు వాగిద్వాదం చోటుచేసుకుంది. అటవీ సిబ్బంది గువ్వలగుట్ట గ్రామానికి చెందిన రైతును తీసుకుపోతున్న విషయం తెలిసిన గ్రామస్తులు వాహనాన్ని వెంబడించారు. అప్పటికే ఆంజనేయ స్వాములతో వాగ్వాదం జరుగుతున్న ప్రాంతానికి గ్రామస్తులు చేరుకొని ఫారెస్ట్‌ అధికారులతో ఘర్షణ పడ్డారు. ఇరువురి మధ్య జరిగిన గొడవ దాడికి దారితీసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -