Thursday, November 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఫ్లెక్సీల తొలగింపుపై రగడ

ఫ్లెక్సీల తొలగింపుపై రగడ

- Advertisement -

మంత్రి వెంకటరెడ్డిపై కవిత ఫైర్‌
మున్సిపల్‌ అధికారులపై మంత్రి ఆగ్రహం
ఒకరి ప్రచారాన్ని అడ్డుకునే హక్కు లేదని అధికారులకు సూచన

నవతెలంగాణ-నల్లగొండటౌన్‌
నల్లగొండలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపు వివాదానికి దారితీసింది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్వారును జాగృతి కార్యకర్తలు అడ్డుకోగా.. మరోవైపు జాగృతి అధ్యక్షులు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంత్రిని నిలదీశారు. ఫ్లెక్సీల విషయం తెలిసిన మంత్రి మున్సిపల్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జాగృతి జనంబాట రాష్ట్రవ్యాప్త కార్యక్రమంలో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో వివిధ కార్యక్రమాలు చేపట్టింది. జాగృతి నాయకులు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని ప్రధాన కూడళ్లలో కవిత ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన నల్లగొండలో ఉన్నందున కవిత ఫ్లెక్సీలను మున్సిపల్‌ అధికారులు తొలగించారు. దీనిపై నల్లగొండ పర్యటనలో ఉన్న కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పెద్ద మినిస్టర్‌ అనుకున్న.. మా వాళ్లు ఉత్సాహంతో ఫ్లెక్సీలు పెడితే ఇంత ఓర్వలేని తనమా.. మీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను మీ దృష్టికి తీసుకురావడం తప్పంటే ఎలా..? మా ప్రశ్న లకు సమాధానాలు చెప్పలేకనే ఫ్లెక్సీలు తీయిం చారు.. ఇది రాజకీయాల్లో మీ స్థాయిని తగ్గించు కోవడమే.. మీతో నాకు ఎలాంటి పంచాయితీ లేదు’ అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపినందుకే తమపై ఇలాంటి దాడులు చేస్తున్నారని కవిత ఆరోపించారు.

మంత్రి కాన్వారు అడ్డగింత
కవిత ఫ్లెక్సీలను తొలగించడాన్ని నిరసిస్తూ నల్లగొండకు వస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్వారును మర్రిగూడ జంక్షన్‌ వద్ద జాగృతి కార్యకర్తలు అడ్డుకొని నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు.

ఫ్లెక్సీలను తొలగించిన అధికారులను నిలదీసిన మంత్రి
తెలంగాణ జాగృతి ఫ్లెక్సీలను తొలగించడంపై మున్సిపల్‌ కమిషనర్‌, పోలీసు అధికారులను ఇందిరాభవన్‌లో రోడ్లు, భవనాల శాఖ మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి రాజకీయాలు వాళ్లను చేసుకోని వ్వాలి.. ఏదైనా ఉంటే రాజకీయంగా చూసు కుంటాం.. ఒకరి ప్రచారాన్ని అడ్డుకునే హక్కు మనకు లేదని మంత్రి అన్నారు. ”ఫ్లెక్సీలు తొలగించాలని ఎవరు చెప్పారు..? మీరు చేసిన తప్పిదం వల్ల మిగతా వాళ్లతో నేను మాటలు పడాల్సి వస్తుంది” అని అసహనం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -