- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అల్‌ఖైదా గుజరాత్ ఉగ్ర కుట్ర కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణను వేగవంతం చేసింది. ఈ మేరకు కేసులో నలుగురు అక్రమ బంగ్లాదేశ్ వలసదారులు ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. పశ్చిమ బెంగాల్, త్రిపుర, మేఘాలయ, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లోని అనుమానితులు, వారి సహచరుల నివాసాల్లో ఎన్‌ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నాయి. ఈ సోదాల్లో అనేక డిజిటల్ పరికరాలు, ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు.
- Advertisement -



