నవతెలంగాణ – ఆత్మకూరు
హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని కొత్తగట్టు గ్రామ శివారులో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందినట్లు, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి అని ఆత్మకూరు సిఐ సంతోష్ తెలిపారు. పరకాల నుండి హనుమకొండ కు వెళ్తున్న కారు అతివేగంగా వెళుతూ కొత్తగట్టు గ్రామ శివారులో అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
మృతి చెందిన వారిలో పర్షా సంపత్ ,(చంద్రయ్య,) రేగొండ మండలం ,రేపాకపల్లి గ్రామ వాసి , మరో మృతుడు బొంపల్లి కృష్ణ (సంపత్ రావు), పరకాల మండలం నాగారం గ్రామ వాసిగా గుర్తించినట్లు వారు తెలిపారు. గాయాలైన వారిలో చింతపట్ల మురళీకృష్ణ, ఆత్మకూర్, పోతరాజు వెంకటేష్ ,రాజు, కామిరెడ్డి పల్లి వాసిగా గుర్తించామని సీఐ వెల్లడించారు. ప్రమాద సమాచారం అందగా సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజిఎంకు తరలించాం. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా . సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్టు సీఐ తెలిపారు.



