Thursday, November 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది

- Advertisement -

ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
నవతెలంగాణ – మిర్యాలగూడ 

బీసీలకు విద్య ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు గురువారం బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగంగౌడ్ అధ్వర్యంలో బీసీల ధర్మ పోరాట దీక్ష చేశారు. ఈ దీక్షకు అఖిల పక్ష పార్టీల నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.దీక్షను ఉద్దేశించి ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉందనీ అన్నారు.బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించిన కూడా నెలల తరబడి బిల్లు గురించి పట్టించుకోవడం లేదని తెలిపారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసిన కూడా కేంద్రం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. బీసీల కోసం కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ తీసుకొస్తుంటే బిజెపి కావాలని కాలయాపన చేస్తుందని అన్నారు.

బీసీలకు బిజెపి వ్యతిరేకత అని ఆరోపించారు. కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్ బీసీ రిజర్వేషన్ బిల్లుపై అభిప్రాయం చెప్పాలన్నారు.బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ లింగంగౌడ్ మాట్లాడుతూ వచ్చే పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ బీసీ బిల్లు పెట్టాలని అన్నారు.బీసీ బిల్లును బీసీ ప్రధాని అయిన నరేంద్ర మోడీ ఆమోదించి బీసీల న్యాయమైన రిజర్వేషన్ల డిమాండ్ ను ఆమోదించాలన్నారు. ఈ కార్యక్రమంలో బంటు వెంకటేశ్వర్లు, ఎర్రబెల్లి దుర్గయ్య, మహేష్ గౌడ్, సందెనబోయిన జయమ్మ, బంటు కవిత, జానపాటి రవి, డాక్టర్ రాజు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు బంటు గిరి, అంబేద్కర్ యువజన సంఘం  కొమ్ము శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎండి షోయబ్ మండల సోములు పొదిలి శ్రీనివాస్, సయ్యద్ ఫరూక్, గాజుల శ్రీనివాస్, చిలుకూరి బాలు, పోలగాని వెంకటేష్, వజ్రగిరి అంజయ్య నాయుడు, సిపిఐ ధనుంజయ నాయుడు, సైదులు, అనిల్, సతీష్, దోనేటి అశోక్, బంటు సైదులు, పాశం శ్రీను, గాలం వెంకన్న యాదవ్, అంతటి రాములు గౌడ్, తాళ్లపల్లి విజయ్, శ్రీనివాస్ యాదవ్, దాసరాజు జయరాజు, ఆర్లపూడి శ్రీనివాస్, దుర్గా భవాని, కలమ్మ, కల్పన, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -